భారతదేశం, సెప్టెంబర్ 29 -- వార్ 2 ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? అంటూ ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ను సోషల్ మీడియాలోని ఓ అప్ డేట్ ఆనందాన్ని అందిస్తోంది. వార్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనంటూ ఓ పోస్టర్ తెగ హల్ చల్ చేస్తోంది. అదే రోజు వార్ 2 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

2025 బిగ్గెస్ట్ ఫిల్మ్స్ లో వార్ 2 ఒకటి. త్వరలోనే ఇది ఓటీటీలో ప్రీమియర్ కానుంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా వార్ 2 ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మల్టీ స్టారర్ ఈ ఓటీటీలోకే రాబోతోంది.

సాధారణంగా బాలీవుడ్ సినిమాలు 8 వారాల విండో తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. అలా చూసుకుంటే వార్ 2 అక్టోబర్ 2న దసరా సందర్భంగా లేదా అక్టోబర్ 9న ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. ...