భారతదేశం, అక్టోబర్ 6 -- హాలీవుడ్ హారర్ థ్రిల్లర్లు అంటేనే వేరే లెవల్. ఇక అందులోనూ ది కాంజురింగ్ సిరీస్ కు మరింత స్పెషాలిటీ ఉంది. ఈ సినిమాను ఆడియన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. భయంతో చంపేస్తాయి. ఇప్పుడు ఈ సిరీస్ లోని తొమ్మిదో సినిమా 'ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్' ఓటీటీలోకి రాబోతుంది. ఆడియన్స్ ను భయపెట్టేంత థ్రిల్ అందించడానికి డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.

ది కాంజురింగ్ ఫ్రాంఛైజీలోని సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. హారర్ థ్రిల్లర్లకు ఇవి ఒక బెంచ్ మార్క్ లాంటివి. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. అక్టోబర్ 7 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

రీసెంట్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్ మూవీ ఓటీటీలోకి దూసుకొస్తుంది. ఈ స...