Hyderabad, జూన్ 28 -- ఓటీటీలోకి విచిత్రమైన కంటెంట్‌తో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు అరంగేట్రం చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్‌తోపాటు రొటీన్ స్టోరీస్ అయిన డిఫరెంట్ టేకింగ్‌తో సినిమాలు, వెబ్ సిరీసులను ఓటీటీల్లో దింపుతుంటారు మేకర్స్. వాటిలో ఎన్నో రకాల జోనర్స్ ఉంటాయి.

అయితే, ఇటీవల కాలంలో ఒకే జోనర్‌కు పరిమితం కాకుండా పలు ఎలిమెంట్స్‌తో క్రైమ్ థ్రిల్లర్స్‌ను తెరకెక్కిస్తున్నారు. అలా రీసెంట్‌గా ఓటీటీలోకి నయా బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. ఆ సిరీస్ పేరే బ్యాడాస్ బేగమ్. ఐశ్వర్య రాజే అనేది క్యాప్షన్. అంటే, ఊర్వశి రాజే అనే యువతి చుట్టూ బ్యాడాస్ బేగమ్ సిరీస్ కథ సాగుతుంది.

ముంబై సిటీలోకి ఊర్వశి రాజే అనే యువతి వస్తుంది. తనకు ఖరీదైన జీవితం గడపాలని ఉంటుంది. పెద్ద పెద్ద బంగ్లాలు, హోటల్స్‌లో జీవించాలనుకుంటుంది. అందుకోసం ముంద...