భారతదేశం, డిసెంబర్ 15 -- కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన మరో సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గ్రీన్ (Green). ఈ ఏడాది అక్టోబర్‌లో థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న మూవీ ఇది. ఇప్పుడీ సినిమా ఆదివారం (డిసెంబర్ 14) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈమధ్య కన్నడ కంటెంట్ పై ఎక్కువగా దృష్టిసారించిన జీ5 ఓటీటీ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. ఈ మూవీ పేరు గ్రీన్. డిసెంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి ఐఎండీబీలో 8.2 రేటింగ్ రావడం విశేషం. ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ సినిమా సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ అయింది.

రాజ్ విజయ్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ సైకలాజికల్ థ్రిల్లర్ గ్రీన్. ఈ సినిమా కథ ప్రధానంగా "మాయన్న" (గోపాల్ కృష్ణ దేశ్‌పాండే) అనే వ్యక్తి చుట్టూ త...