భారతదేశం, డిసెంబర్ 18 -- తెలుగులో కాస్త బోల్డ్ సబ్జెక్ట్ తోనే వచ్చినా ఎక్కడా హద్దు మీరకుండా ప్రేక్షకులను అలరించిన కామెడీ మూవీ సంతాన ప్రాప్తిరస్తు. స్పెర్మ్ కౌంట్ సరిగా లేక ఇబ్బంది పడే హీరో చుట్టూ తిరిగే కథ ఇది. ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి అడుగుపెట్టబోతోంది.

విక్రాంత్, చాందినీ చౌదరి లీడ్ రోల్స్ లో నటించిన సంతాన ప్రాప్తిరస్తు మూవీ శుక్రవారం (డిసెంబర్ 19) డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ సినిమా ఒకేసారి అటు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఇటు జియోహాట్‌స్టార్ లలోకి రానుంది. హాట్‌స్టార్ ఈ విషయాన్ని గురువారం (డిసెంబర్ 18) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"ఓ సిగ్గుపడే భర్త.. ఎంతో ఆశతో ఉన్న భార్య.. ఓ ఊహించని ఫెర్టిలిటీ ట్విస్ట్.. ప్రేమ, నవ్వు, గందరగోళం చూడటానికి సిద్ధంగా ఉండండి. సంతాన ప్రాప్...