భారతదేశం, ఆగస్టు 10 -- థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన హిందీ సూపర్ హిట్ ఫిల్మ్ 'మెట్రో ఇన్ దినో' (Metro In Dino) ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పై లేటెస్ట్ బజ్ ఇంట్రెస్ట్ రేపుతోంది. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా మెట్రో ఇన్ దినో జూలై 4న థియేట్రికల్ రిలీజ్‌తో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. ఇప్పుడు డిజిటల్ డెబ్యూ కు సిద్ధమవుతోంది.

అనురాగ్ బసు దర్శకత్వం వహించిన మెట్రో ఇన్ దినో మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ ఓటీటీలోనే బ్లాక్ బస్టర్ సినిమా రాబోతోంది. అయితే సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా ఆగస్టు 29న ఓటీటీ ప్రీమియర్‌ కాబోతుందని తెలిసింది. అయితే దీని ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సినిమా, ఓటీటీ రిలీజ్‌ల మధ్య సాధారణ ...