Hyderabad, ఆగస్టు 13 -- అమెరికన్ సూపర్ హీరో మూవీ, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఏడో స్థానంలో ఉన్న సూపర్‌మ్యాన్ (2025) నెల రోజులకే ఓటీటీలోకి వస్తోంది. ఈ విషయాన్ని ఓ మూవీ డైరెక్టర్ జేమ్స్ గన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అయితే మరీ ఇంత త్వరగా ఎందుకు డిజిటల్ ప్రీమియర్ చేస్తున్నారంటూ పలువురు అభిమానులు మూవీ టీమ్ పై మండిపడుతున్నారు.

జేమ్స్ గన్ డైరెక్ట్ చేసిన సూపర్ హీరో మూవీ సూపర్‌మ్యాన్. ఈ సినిమా జులై 11న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇది సబ్‌స్క్రైబర్లందరికీ ఫ్రీగా అందుబాటులోకి రావడం లేదు. మూవీ చూడాలంటే రెంట్ చెల్లించాల్సిందే.

మూవీ కోసం ఇప్పుడే ప్రీఆర్డర్ చేయొచ్చని కూడా డైరెక్టర్ జేమ్స్ గన్ చెప్పాడు. లేదంటే థియేటర్లలో ఉన్నప్పుడే చూడాలని కోరాడు. "సూపర్‌మ్యాన్...