భారతదేశం, ఆగస్టు 23 -- రజనీకాంత్ లేటెస్ట్ సినిమా 'కూలీ' (Coolie) బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. థియేటర్లలో అదరగొడుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ కూలీ సినిమా ఓటీటీ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రైమ్ వీడియో ఓటీటీలోనే రిలీజ్ కానుంది. అయితే స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు? అనేదానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఓటీటీ రిలీజ్ డేట్ మరింత ఆలస్యమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.

థియేటర్లలో ప్రప...