భారతదేశం, డిసెంబర్ 18 -- హర్షవర్ధన్ రాణే, సోనమ్ బజ్వా జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా 'ఏక్ దీవానే కీ దీవానియత్' డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ ఏడాది అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 110 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా.. డిసెంబర్ 26 నుంచి జీ5 (ZEE5) లో స్ట్రీమింగ్ కానుంది.

థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించి, బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన హిందీ రొమాంటిక్ డ్రామా 'ఏక్ దీవానే కీ దీవానియత్'. హర్షవర్ధన్ రాణే, పంజాబీ బ్యూటీ సోనమ్ బజ్వా జంటగా నటించిన ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇప్పుడు మీ ఇంట్లోని స్క్రీన్లపై సందడి చేయడానికి రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ఈ సినిమాను డిసెంబర్ 26న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

మిలాప్ జవేరి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయం సాధించింది. ప్రపం...