Hyderabad, సెప్టెంబర్ 15 -- ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ లో అతి పెద్ద హిట్స్ లో ఒకటి సయ్యారా (Saiyaara). ఈ సినిమా గత శుక్రవారం అంటే సెప్టెంబర్ 12న నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టింది. ఊహించినట్లే మూడు రోజుల్లోనే ఈ మూవీ టాప్ లోకి దూసుకెళ్లింది. ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసిన జాబితాలో టాప్ 5 సినిమాలు ఇలా ఉన్నాయి.

ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న సయ్యారా మూవీ నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టగానే రికార్డు వ్యూస్ సాధించింది. ఏకంగా 5.5 మిలియన్ల వ్యూస్ తో తొలి స్థానంలో నిలిచింది. గత వారం ఎక్కువ మంది చూసిన సినిమా ఇదే కావడం విశేషం. ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

అటు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ కూడా గత వారమే ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాను కూడా ఎగబడి చూసేస్తున్న...