భారతదేశం, ఆగస్టు 6 -- శ్రీ మహా విష్ణువు అవతారాల్లో ఒకటైన నరసింహా అవతారం ఆధారంగా వచ్చిన యానిమేటెడ్ ఫిల్మ్ 'మహావతార్ నరసింహా' (Mahavatar Narsimha) బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటుతోంది. మౌత్ టాక్ తో జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన యానిమేటెడ్ ఫిల్మ్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై బజ్ నెలకొంది.

థియేటర్లలో అదరగొడుతున్న మహావతార్ నరసింహా మూవీ ఓటీటీ రిలీజ్ పై క్రేజీ బజ్ నెలకొంది. రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ రోహిత్ జైస్వాల్ ప్రకారం, మహావతార్ నరసింహ హిందీలో జియోహాట్‌స్టార్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది అని ఇండియా టైమ్స్ నివేదించింది. ఈ కన్నడ యానిమేటెడ్ ఫిల్మ్ తెలుగు సహా ఇతర భాషల్లోనూ థియేటర్లలో రిలీజైంది.

ఈ నేపథ్య...