Hyderabad, జూలై 4 -- టాలీవుడ్‌లోని ముగ్గురు హీరోలు కలిసిన నటించిన సినిమా భైరవం. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ నటించిన మల్టీ స్టారర్ సినిమా భైరవం తమిళ సూపర్ హిట్ మూవీ గరుడన్‌కు రీమేక్‌గా తెలుగులో వచ్చిన విషయం తెలిసిందే.

విభిన్న చిత్రాలతో దర్శకుడిగా మంచి ప్రతిభ కనబర్చిన విజయ్ కనకమేడల భైరవం సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధా మోహన్ భైరవం సినిమాను భారీగా నిర్మించారు. భైరవం సినిమాలో ముగ్గురు హీరోలు ప్రధాన పాత్రలు పోషించారు.

వీరితోపాటు భైరవం సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్వా పిళ్లై హీరోయిన్స్‌గా చేశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన భైరవం సినిమా వరల్డ్ వైడ్‌గా మే 30న థియేటర్లలో విడుదలైంది. అయితే, భైరవం సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. సినిమా స్టోరీ రొటీన్‌గా ఉన్న టేకింగ్‌లో కాస్త...