భారతదేశం, సెప్టెంబర్ 14 -- మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటించిన మూవీ ఓటీటీలోకి రాబోతోంది. తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'ది మద్రాస్ మిస్టరీ- ఫాల్ ఆఫ్ ఎ సూపర్ స్టార్' తో 11 ఏళ్ల తర్వాత తిరిగి కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ భామ. భారతకు స్వాతంత్రం రావడానికి ముందు జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ థ్రిల్లర్ ను రూపొందించారు. ఈ మూవీపై ఇప్పటి నుంచే క్రేజీ బజ్ నెలకొంది.

ప్రముఖ నటి నజ్రియా నజీమ్ 'ది మద్రాస్ మిస్టరీ - ఫాల్ ఆఫ్ ఎ సూపర్ స్టార్' అనే బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో రూపొందిన పీరియాడికల్ క్రైమ్ థ్రిల్లర్ తో తమిళ సినిమా రంగంలోకి తిరిగి రానుంది. ఈ చిత్రం నవంబర్ 6, 2025న సోనీ లివ్ ఓటీటీలో ప్రీమియర్ కానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ డైరెక్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. భారతదేశంలోని పురాతనమైన పరిష్కారం కాని నేరాలలో ఒకదానిపై కొత్త టేక్ ఇది.

నూతన దర్శకుడు ఆషిఫ్ ప...