Hyderabad, ఆగస్టు 22 -- ఓటీటీ మలయాళ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు మంచి క్రేజ్ ఉంటుంది. మలయాళం నుంచి ఎలాంటి మూవీ, వెబ్ సిరీస్ వచ్చిన మంచి బజ్ క్రియేట్ చేసుకుంటుంది. అలాగే, వాటిపై ఇండియా వైడ్ ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఓటీటీలోకి నయా మలయాళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయా వెబ్ సిరీస్ "ది క్రోనికల్స్ ఆఫ్ ది ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్". ఇది ఒక మలయాళ క్రైమ్ కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. తాజాగా 4.5 గ్యాంగ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో అన్ని రకాల ఎలిమెంట్స్ చూపించారు.

అది చూస్తుంటే ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్ ఓటీటీ సిరీస్‌లో క్రైమ్, లవ్, రొమాన్స్, కామెడీ ఎలిమెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ సిరీస్‌ను యదార్థ సంఘటనల ఆధారంగా, త్రివేండ్రం బ్యాక్ డ్రాప్‌ల...