భారతదేశం, ఆగస్టు 24 -- ఓటీటీలోకి మరో యూత్ రొమాంటిక్ లవ్ స్టోరీ వచ్చేసింది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను అలరించేందుకు అడుగుపెట్టింది. ఇవాళ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది 'ప్రేమ ఎక్కడ నీ చిరునామా' అనే సినిమా. ఆదివారం (ఆగస్టు 24) ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ ను పలకరించింది. ఈ లవ్ స్టోరీ ఏ ఓటీటీలో ఉందో చూద్దాం.

వరుసగా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్లతో దూసుకుపోతోంది ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్. ఈ ఓటీటీలో రీసెంట్ గా వచ్చిన హారర్ థ్రిల్లర్ కానిస్టేబుల్ కనకం రికార్డు వ్యూస్ తో సాగిపోతోంది. ఇదే ఓటీటీలో కథా సుధాలో భాగంగా ప్రతి ఆదివారం ఓ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ ఆదివారం (ఆగస్టు 24) 'ప్రేమ ఎక్కడ నీ చిరునామా' అనే మూవీ వచ్చేసింది.

ఈటీవీ విన్ లో కథా సుధాలో భాగంగా ఈ ఆదివారం ప్రేమ ఎక్కడ నీ చిరునామా అనే యూత్ ఫుల్ ల...