Hyderabad, సెప్టెంబర్ 16 -- ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ మధ్యే 'సత్తముమ్ నీదియుమ్' అనే లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తర్వాత ఇప్పుడు 'వేడువన్' అనే కొత్త షోను లాంచ్ చేస్తోంది. ఈ సిరీస్‌లో నటుడు కన్న రవి లీడ్ రోల్‌లో నటించాడు. ఈ సిరీస్ కు సంబంధించిన చిన్న గ్లింప్స్ వీడియోను మేకర్స్ మంగళవారం (సెప్టెంబర్ 16) లాంచ్ చేశారు.

జీ5 ఓటీటీలోకి వస్తున్న తమిళ్ సిరీస్ 'వేడువన్'. దీనికి అర్థం వేటగాడు అని. ఈ సిరీస్‌లో నటుడు కన్న రవి లీడ్ రోల్‌లో నటించాడు. ఈ సిరీస్ ఒక మంచి ఎమోషనల్ డ్రామా అని, ఇది ఆకట్టుకునే కథనంతో, శక్తివంతమైన నటనతో వస్తుందని అంటున్నారు.

ఈ సిరీస్‌లో కన్న రవితోపాటు సంజీవ్ వెంకట్, శ్రవణిత శ్రీకాంత్, రమ్య రామకృష్ణ, రేఖ నాయర్ కూడా నటించారు. 'వేడువన్' అక్టోబర్ 10న జీ5 ఓటీటీలో ప్రీమియర్ అవుతుంది.

జీ5 ...