భారతదేశం, నవంబర్ 10 -- మీకు స్పోర్ట్స్ డామాలు అంటే ఇష్టమా? అయితే ఓటీటీలోకి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ వస్తోంది. దీని పేరు రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్. సోమవారం (నవంబర్ 10) ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్' వెబ్ సిరీస్ ట్రైలర్ చివరకు ఆన్‌లైన్‌లో విడుదలైంది. ఈ సోనీ లివ్ ఒరిజినల్ సిరీస్‌లో మానవ్ కౌల్, జీషన్ ఆయుబ్ ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని ఆటంకాలను సమర్థంగా అధిగమించి ఒక ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి వీరు నిజమైన నాయకులుగా ఎలా మారారో ఈ ట్రైలర్ చూపించింది. డిసెంబర్‌ 9న సోనీ లివ్ ఓటీటీలో ప్రీమియర్‌ కానుంది.

ఒక నిజ జీవిత కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. 'రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్' ట్రైలర్‌తో పాటు ...