భారతదేశం, సెప్టెంబర్ 14 -- నెట్‌ఫ్లిక్స్ పాపులర్ వెబ్ సిరీస్ విచర్ సీజన్ 4 కొత్త సీజన్ తిరిగొస్తోంది. కొత్త సీజన్ కథను ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ఈ సిరీస్ లో నటులు, కథ చెప్పే శైలిలో పెద్ద మార్పులను తీసుకువస్తుంది. 2019 లో దాని ప్రారంభం నుండి, ఈ షో నెట్‌ఫ్లిక్స్ అతిపెద్ద ఫాంటసీ డ్రామాలలో ఒకటిగా మారింది. మాయాజాలం, రాక్షసులు, రాజకీయాలు, దెయ్యాలు, బలమైన పాత్రల మిశ్రమం కారణంగా ఈ వెబ్ సిరీస్ ని ప్రశంసిస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్ హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ విచర్ సీజన్ 4 ఓటీటీ రిలీజ్ వచ్చేసింది. ఈ కొత్త సీజన్ అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అన్ని ఎపిసోడ్లు ఒకే సమయంలో విడుదల అవుతాయి. సీజన్ 1 ఏమో డిసెంబర్ 20, 2019లో రిలీజైంది. 2021, డిసెంబర్ 17న రెండో సీజన్ స్ట్రీమింగ్ కు వచ్చింది. 2023 జూన్ 29 నుంచి మూడో సీజన్ ఓటీటీ ఆడియన్స్ కు అందుబాటులోకి ...