భారతదేశం, డిసెంబర్ 12 -- నటి, దర్శకురాలు టిస్కా చోప్రా తెరకెక్కించిన మర్డర్ మిస్టరీ 'సాలీ మొహబ్బత్' (Saali Mohabbat) ఈరోజు అంటే డిసెంబర్ 12న జీ5లో స్ట్రీమింగ్ కు వచ్చింది. రాధికా ఆప్టే, దివ్యేందు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో.. రాధిక నటనకు మంచి మార్కులు పడినా, కథనంలో ఉండాల్సిన ఉత్కంఠ లోపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది టిస్కా చోప్రా తీసిన పాపులర్ షార్ట్ ఫిల్మ్ 'చట్నీ'ని గుర్తుచేస్తోంది. మరి ఈ 'సాలీ మొహబ్బత్' సినిమా ఎలా ఉంది? థ్రిల్లర్ ప్రియులను ఆకట్టుకుందా? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

జీ5 ఓటీటీలోకి నేరుగా వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ సాలీ మొహబ్బత్. ఈ సినిమా స్మిత (రాధికా ఆప్టే) అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. తన భర్త పంకజ్ (అన్షుమాన్ పుష్కర్) చేతిలో మోసపోయిన ఆమె అతన్నే హత్య చేసిన కేసులో ఎలా అనుమానితురాలు అవుతుందన్నది ఇందులో చూ...