Hyderabad, జూలై 23 -- తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన మూవీ మార్గన్ (maargan). ఈ సినిమా గత నెల 27న థియేటర్లలో రిలీజైంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. దీంతో నెల రోజుల్లోపే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతోంది.

తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మార్గన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. శుక్రవారం (జులై 25) నుంచి ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా అదే రోజు మరో ఓటీటీలోకి వస్తోంది.

కేవలం తమిళ వెర్షన్ టెంట్‌కొట్టా ఓటీటీలోకి కూడా అడుగుపెడుతోంది. లియో జాన్ పాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రూ.12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే బాక్సాఫీస్ దగ్గర రూ.14 కోట్లు వసూలు చేసింది. సీరియల్ కిల్లర్, పోలీస్ ఇన్వెస్టిగేషన్...