భారతదేశం, జనవరి 26 -- తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో సూపర్ బ్లాక్‌బస్టర్ మూవీ సిరాయ్ (Sirai). ఈ సినిమా గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించింది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. ఏకంగా రూ.31 కోట్లు వసూలు చేసింది. ఆ సినిమా ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలోకి అందుబాటులోకి రావడం విశేషం.

విక్రమ్ ప్రభు లీడ్ రోల్లో నటించిన సినిమా ఈ సిరాయ్. అంటే తెలుగులో జైలు అని అర్థం. దీనిని సోమవారం (జనవరి 26) నుంచి తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు జీ5 ఓటీటీ వెల్లడించింది. తెలుగుతోపాటు కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

"తమిళనాడును షాక్‌కు గురి చేసిన సినిమా. ఇప్పుడు తెలుగులో.. సిరాయ్ జీ5లో.. 2025 బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సినిమాను కేవలం తమిళంలోనే ఓటీటీలోకి తీసుకొచ్చినప్పుడు తెలుగు ప్రేక్ష...