భారతదేశం, ఆగస్టు 27 -- తమిళంలో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీస్ వస్తూనే ఉంటాయి. వివిధ జోనర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాయి. ఇలా డిఫరెంట్ జోనర్లో, విభిన్నమైన కథతో తెరకెక్కిన సినిమానే 'మాయకూతు' (Maayakoothu). ఓ రైటర్ రాసే రచనల్లోని పాత్రలు నిజ జీవితంలోనూ ఎదురైతే ఎలా ఉంటుంది పరిస్థితి అనే స్టోరీ లైన్ తో వచ్చింది ఈ మూవీ. ఇప్పుడీ సినిమా ఓటీటీలో అడుగుపెట్టింది.

తమిళ ఫ్యాంటసీ క్రైమ్ థ్రిల్లర్ 'మాయకూతు' ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఇవాళ (ఆగస్టు 27) సన్ నెక్ట్స్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే స్ట్రీమింగ్ మొదలైంది. అయితే కేవలం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. మంచి థ్రిల్ కావాలనే ఆడియన్స్ ఈ మూవీని మిస్ కావొద్దు.

మాయకూతు మూవీ ఈ ఏడాది జులై 11న థియేటర్లలో రిలీజైంది. ఆడియన్స్ కు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అందించిన ఈ మూవీకి థియేటర్లో అదిరే ...