భారతదేశం, ఆగస్టు 12 -- ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ మూవీ వస్తోంది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన 'గుడ్ డే' (Good Day) మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు ముహూర్తం ఖరారైంది. ఫుల్ గా తాగిన ఓ వ్యక్తి రాత్రిలో ఏం చేశాడు? ఓ క్రైమ్ కేసు సాల్వ్ చేయడంలో ఏ విధంగా సాయపడ్డాడు? అనే కథతో గుడ్ డే సినిమా తీశారు.

2025 తమిళ థ్రిల్లర్ డ్రామా 'గుడ్ డే' ఆగస్టు 15 నుంచి సన్ నెక్ట్స్ లో ఓటీటీ ప్లే ప్రీమియం ద్వారా స్ట్రీమింగ్ కానుంది. ఈ ఏడాది జూన్ లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ డెబ్యూ చేయబోతుంది. పోర్ణా జెఎస్ మైఖేల్ కథ రాసిన ఈ సినిమాకు ఎన్ అరవిందన్ దర్శకత్వం వహించారు. అతను 96, మెయియాజగన్ వంటి చిత్రాలలో దర్శకుడు ప్రేమ్ కుమార్‌కు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఓటీటీలోకి ఈ వారమే సినిమా రానుంది.

గుడ్ డే సినిమా జూన్ 27న థియేటర్లలో ర...