భారతదేశం, జూలై 27 -- ఓటీటీలోకి మరో లవ్ స్టోరీ రాబోతోంది. స్వచ్ఛమైన తెలంగాణ ప్రేమ కథతో వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. డైరెక్ట్ గా జీ5 ఓటీటీలో అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో 'మోతెవరి లవ్ స్టోరీ' (Mothevari love story) అనే సిరీస్‌ రాబోతోంది. అనిల్ జీల, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేందుకు ఆగస్ట్ 8న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ అందరినీ మెప్పించింది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ఆదివారం (జులై 27) నాడు తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

మోతెవరి లవ్ స్టోరీ ట్రైలర్ అదిరిపోయింది. అచ్చమైన తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని చూపించింది. ఇక్కడ మనుషుల ప్రేమను చాటింది. మట్టి వాసన తగిలేలా చేసింది. ప్రియ...