Hyderabad, జూన్ 28 -- సౌత్ సినీ ఇండస్ట్రీలో మహానటిగా పేరు తెచ్చుకుంది బ్యూటిపుల్ కీర్తి సురేష్. థియేట్రికల్ సినిమాలు మాత్రమే కాకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో కూడా అలరిస్తోంది. ఇదివరకే చిన్ని, మిస్ ఇండియా వంటి ఓటీటీ సినిమాలతో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అట్రాక్ట్ చేసింది కీర్తి సురేష్.

ఇప్పుడు మరోసారి ఓటీటీ మూవీతో అలరించడానికి రెడీగా ఉంది కీర్తి సురేష్. మహానటి కీర్తి సురేష్ నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మూవీ ఉప్పు కప్పురంబు. ఈ సినిమాలో హీరో సుహాస్ మరో ప్రధాన పాత్ర పోషించాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సెటైరికల్ కామెడీ చిత్రంగా ఉప్పు కప్పురంబు తెరకెక్కింది.

తాజాగా ఉప్పు కప్పురంబు సినిమాలోని మ్యూజిక్ ఆల్బమ్‌ను మేకర్స్ విడుదల చేశారు. జూన్ 27న అంటే శుక్రవారం నాడు ఉప్పు కప్పురంబు సినిమాలోని ప్రత్యేకమైన మూడు పాటలను రిలీజ్ చేశారు. ...