భారతదేశం, ఆగస్టు 11 -- విజయ్ దేవరకొండ లేటెస్ట్ స్పై థ్రిల్లర్ 'కింగ్డమ్' (Kingdom) మూవీ ఓటీటీ రిలీజ్ పై లేటెస్ట్ బజ్ తెగ వైరల్ గా మారింది. బాక్సాఫీస్ దగ్గర అంచనాలు అందుకోలేకపోయిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. కింగ్డమ్ సినిమా ఓటీటీ రిలీజ్ ఇదేనంటూ ఓ బజ్ చక్కర్లు కొడుతోంది.

కింగ్డమ్ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అయితే కింగ్డమ్ ఫిల్మ్ ఇదే నెలలో ఓటీటీలోకి వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఆగస్టు 28, 2025 నుంచి కింగ్డమ్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

విజయ్ దేవరకొండ హీరోగా యాక్ట్ చేసిన కింగ్డమ్ మూవీ జులై...