భారతదేశం, ఆగస్టు 19 -- ఓటీటీ ఆడియన్స్ కు సస్పెన్స్ తో కూడిన థ్రిల్ పంచేందుకు ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. అదిరే పోయే స్టోరీ లైన్ తో, ఉత్కంఠ రేపే ట్విస్ట్ లతో రెడీ అయిన 'శోధ' (Shodha) వెబ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. సొంత భార్యను గుర్తు పట్టలేని భర్త ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాడు, తన ప్రాణాల కోసం పోరాటాన్ని ఎలా సాగించాడనే గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో ఈ సిరీస్ తెరకెక్కింది.

కన్నడ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'శోధ' ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ ఒరిజినల్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ లోకి అడుగుపెట్టనుంది. జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ సిరీస్ అందుబాటులోకి వస్తుంది. ఈ థ్రిల్లర్ సిరీస్ ను జీ5 ఓటీటీ ఒరిజినల్ కన్నడ సిరీస్ గా తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సిరీస్ పై అంచనాలను భారీగా పెంచేసింది.

ట్రైలర్ తో శోధ వెబ్ సి...