భారతదేశం, ఆగస్టు 12 -- చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది ఓ కన్నడ హారర్ కామెడీ థ్రిల్లర్. కన్నడలో అదరగొడుతున్న ఈ సినిమా ఇతర భాషల్లోనూ డబ్ అయ్యి రిలీజ్ అవుతోంది. లేటెస్ట్ గా తెలుగులోనూ రిలీజ్ అయిన ఆ సినిమానే 'సు ఫ్రమ్ సో' (Su From So). ఈ హిలేరియస్ హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగు ఆడియన్స్ ను కూడా బాగానే అట్రాక్ట్ చేస్తోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై క్రేజీ బజ్ వినిపిస్తోంది.

ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'సు ఫ్రమ్ సో' సినిమా ఓటీటీ రిలీజ్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో మంచి రేటు చెల్లించిందని టాక్. ఈ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి రాబోతుంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం థియేటర్లలో...