భారతదేశం, సెప్టెంబర్ 25 -- బాక్సాఫీస్ దగ్గర పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ దుమ్ము రేపుతోంది. గురువారం (సెప్టెంబర్ 25) థియేటర్లలో రిలీజైన ఈ సినిమా కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో హైప్ మరింత పెరిగింది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో? ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం.

పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఓజీ మూవీ ఓటీటీ రిలీజ్ పై బజ్ నెలకొంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఓజీ ఓటీటీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్‌ భారీగానే చెల్లించిందని తెలుస్తుంది. పవన్ కల్యాణ్ కెరీర్ లోనే ఇదే హైయ్యస్ట్ అని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ఓజీ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లోకి రాబోతుందన్నది కన్ఫామ్ అయింది.

ఇక ఓజీ ఓటీటీ రిలీజ్ ఎప్...