Hyderabad, జూలై 6 -- ఓటీటీలోకి ఒకేరోజు థియేటర్లలో విడుదలైన రెండు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్‌పై క్యూరియాసిటీ నెలకొంది. జులై 4న థియేటర్లలో నితిన్ హీరోగా నటించిన తమ్ముడు, సిద్ధార్థ్ చేసిన 3 బీహెచ్‌కే రెండు సినిమాలు విడుదల అయ్యాయి.

అయితే, వీటిలో ఒకటి మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంటే మరోకొటి మాత్రం నెగెటివిటీ మూటగట్టుకుంటోంది. ఈ క్రమంలో తమ్ముడు ఓటీటీ స్ట్రీమింగ్, 3 బీహెచ్‌కే ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్ట్ నెలకొంది. ఈ నేపథ్యంలో తమ్ముడు, 3 బీహెచ్‌కే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

హీరో నితిన్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రమే తమ్ముడు. సీనియర్ హీరోయిన్ లయ ఈ మూవీతో టాలీవుడ్‌లోకి చాలా కాలం గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ఇద్దరు హీరోయిన్స్‌గా చేసిన తమ్ముడు సినిమాలో మలయాళ బ్యూటి స్వాస...