Hyderabad, ఆగస్టు 24 -- ఓటీటీ సస్పెన్స్, క్రైమ్, మిస్టరీ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే వారుండరు. ఎంత ఎంగేజింగ్, థ్రిల్లింగ్‌గా తెరకెక్కిస్తే అవి అంత రెస్పాన్స్ అందుకుంటాయి. అయితే, తెలుగులో ఇటీవల కాలంలో ఎన్నో క్రైమ్ థ్రిల్లర్స్ వస్తూనే ఉంటున్నాయి. అలా, సంవత్సరం క్రితం థియేటర్లలో విడుదలైన తెలుగు క్రైమ్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమానే బ్రహ్మవరం పీఎస్ పరిధిలో.

ఇమ్రాన్ శాస్త్రి దర్శకత్వం వహించిన బ్రహ్మవరం పీఎస్ పరిధిలో మూవీలో గురు చరణ్, సూర్య శ్రీనివాస్, స్రవంతి బెల్లంకొండ, బలగం రూప లక్ష్మీ, యాంకర్ హర్షిణి, సమ్మెట గాంధీ, జీవా, ప్రేమ్ సాగర్, రుద్ర తిప్పే స్వామి నటించారు. డిఫరెంట్ షేడ్స్‌తో క్రైమ్, మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు.

బ్రహ్మవరం పోలీస్ స్టేషన్ ముందు తల లేని ఓ శవం పోలీసులకు దొరుకుతుంది. అది ఎవరిది, ఎవరు ...