భారతదేశం, నవంబర్ 26 -- ఈవారం ఓటీటీలో సౌత్ భాషలకు చెందిన కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ వస్తున్నాయి. వీటిలో ఒక మాస్ యాక్షన్ మూవీ, ఒక క్రేజీ కామెడీ, ఒక ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్, ఒక సైకలాజికల్ డ్రామా ఉన్నాయి. రవితేజ నటించిన 'మాస్ జాతర', షరాఫ్ యు ధీన్ ప్రధాన పాత్ర పోషించిన 'ది పెట్ డిటెక్టివ్', 'ఆర్యన్', 'రోనీ' ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషలకు చెందిన ఈ తాజా సినిమాలను నెట్‌ఫ్లిక్స్, జీ5, సన్ నెక్స్ట్ వంటి వివిధ ప్లాట్‌ఫామ్‌లలో చూడొచ్చు.

మాస్ మూమెంట్స్, యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్స్‌లతో రవితేజ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. భాను బోగవరపు రచించి, దర్శకత్వం వహించిన ఈ తెలుగు మూవీలో ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి ఒక గ్రామంలోని క్రైమ్ లార్డ్‌ను ఎలా ఎదుర్కొంటాడు అనేది ప్రధాన కథాంశం. ఈ సినిమాలో ప్రముఖ నటి ...