Hyderabad, ఆగస్టు 29 -- ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, ఇటీవల కాలంలో తెలుగులోనూ విభిన్నమైన కంటెంట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఓ హత్య, దాని చుట్టూ నడిచే ఇన్విస్టిగేషన్, ఈ క్రమంలో ఎదుటివారిపై వచ్చే అనుమానాలతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది.

అయితే, వీటిని ఎంత పర్‌ఫెక్ట్‌గా తెరకెక్కిస్తే అవి అంతలా హిట్ అవుతాయి. గత నెల తెలుగులో క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన సినిమా ది 100. ఈ సినిమాలో మొగలి రేకులు సీరియల్ హీరో ఆర్కే సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు ప్రధాన పాత్ర పోషించాడు. మొగలి రేకులు తర్వాత ఆర్కే నాయుడు మళ్లీ పవర్‌ఫుల్ పోలీస్‌గా నటించి సినిమా ఇది.

ది 100 సినిమాలో మిషా నారంగ్, విష్ణుప్రియ, ధన్య బాలకృష్ణ హీరోయిన్స్‌గా నటించారు. వీరితోపాటు ఆనంద్, తారక్ పొన్నప్ప, కల్యాణి నటరాజన్, ...