Hyderabad, జూన్ 26 -- ఓటీటీలోకి ప్రతివారం ఎన్నో రకాల సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. వారంలో సుమారు 20 నుంచి 30 వరకు ఓటీటీ సినిమాలు రిలీజ్ అవుతుంటే అవన్నీ రోజుకు కొన్ని డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి. అలా ఇవాళ ఓటీటీలోకి ఓ న్యూ క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

ఆ సినిమానే ది వర్డిక్ట్. అంటే తీర్పు అని అర్థం వస్తుంది. తమిళంలో క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కింది ది వర్డిక్ట్. ఇందులో మిస్టరీ, రివేంజ్, లవ్ స్టోరీ వంటి అంశాలు కూడా ఉన్నాయి. ది వర్డిక్ట్ సినిమాకు క్రిష్ణ శంకర్ కథ, దర్శకత్వం రెండు వహించారు. అలాగే, ప్రకాష్ మోహన్ దాస్ ది వర్డిక్ట్ మూవీకి నిర్మాతగా వ్యవహరించి నిర్మించారు.

ఆదిత్య రావు సంగీతం అందించిన ఈ సినిమాకు అగ్ని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. ది వర్డిక్ట...