Hyderabad, జూలై 4 -- ఓటీటీలోకి ఎన్నో వివిధ రకాల జోనర్స్‌తో కంటెంట్ సినిమాలు డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి. థియేటర్లలో చిన్న, పెద్ద సినిమాలు ఆడినట్లుగానే ఓటీటీలోకి సైతం బిగ్ స్టార్స్ ఎంట్రీ ఇస్తూ ఒరిజినల్ కంటెంట్స్ చేస్తున్నారు. అలా కీర్తి సురేష్ డైరెక్ట్ ఓటీటీ సినిమాలను ఎప్పటి నుంచో చేస్తోంది.

ఇక తాజాగా ఇవాళ (జూలై 4) నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేష్ కామెడీ మూవీ ఉప్పు కప్పురంబు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌తో పాటు హీరో సుహాస్ కూడా యాక్ట్ చేశాడు. వరుసగా థియేట్రికల్ సినిమాలతో అలరించే సుహాస్ మరో ఓటీటీ సినిమా అయిన ఉప్పు కప్పురంబుతో ఆడియెన్స్‌ను పలకరించాడు.

కీర్తి సురేష్-సుహాస్ తొలిసారిగా కలిసి నటించిన ఉప్పు కప్పురంబు సినిమాకు ఐవీ శశి దర్శకత్వం వహించారు. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర...