Hyderabad, ఆగస్టు 22 -- బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇవాళ (ఆగస్ట్ 22) థియేటర్లలో అనుపమ పరమేశ్వరన్ నటించిన ఫీమేల్ సెంట్రిక్ మూవీ పరదా రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది. ఇదే క్రమంలో ఇవాళ ఓటీటీలో అది కూడా తెలుగులో అనుపమ పరమేశ్వరన్ తమిళ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

ఆ సినిమానే జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. తమిళంలో కోర్ట్ రూమ్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, తమిళ పాపులర్ నటుడు సురష్ గోపి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించారు.

కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై J. ఫణీంద్ర కుమార్ జేఎస్‌కే సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో లైంగిక వేధింపులకు గురైన యువతిగా అనుపమ పరమేశ్వరన్ కనిపించింది. జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా కథలోకి వ...