భారతదేశం, ఆగస్టు 13 -- ఉత్కంఠకు తెరపడనుంది. ఆడియన్స్ సూపర్ థ్రిల్ అందిస్తూ సాగుతున్న వెడ్నెస్ డే సీజన్ 2లో పార్ట్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ కు ముహూర్తం ఖరారైంది. ఈ గ్లోబల్ ట్రెండింగ్ వెబ్ సిరీస్ రెండో సీజన్ పార్ట్ 2 ఓటీటీలోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఫస్ట్ పార్ట్ ఆగస్టు 6న ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

అమెరికన్ హారర్ థ్రిల్లర్ సిరీస్ వెడ్నెస్ డే సీజన్ 2 పార్ట్ 1 ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆగస్టు 6న ఈ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది. ఈ ఫస్ట్ పార్ట్ లో 4 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ పార్ట్ లోని 8 ఎపిసోడ్లు కూడా రిలీజ్ కాబోతున్నాయి. సెప్టెంబర్ 3న ఈ సెకండ్ పార్ట్ ఓటీటీలో విడుదలవుతుంది. వెడ్నెస్ డే సీజన్ 2 ఆడియన్స్ ను తిరిగి నెవర్మోర్ అకాడమీకి తీసుకెళ్లింది. జెన్నా ఒర్టెగా నేతృత్వంలోని ఈ సిరీస్...