భారతదేశం, జూలై 27 -- థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మైండ్ బ్లాక్ చేసే ట్విస్ట్ లతో సాగే సినిమా ఓటీటీని ఏలుతోంది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఆ ఫిల్మ్ అదరగొడుతోంది. ఓటీటీని షేక్ చేస్తున్న ఆ మూవీనే.. 'చౌర్య పాఠం' (Chaurya paatham). ఈ క్రైమ్ థ్రిల్లర్ కు ఓటీటీ ఆడియన్స్ జై కొడుతున్నారు.

చౌర్య పాఠం సినిమాకు ఓటీటీలో అదిరే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిన్న సినిమా పెద్దగా అంచనాల్లేకుండా ఏప్రిల్ 25, 2025న థియేటర్లకు వచ్చింది. పాజిటివ్ టాక్ వచ్చినా పబ్లిసిటీ లేకపోవడంతో కలెక్షన్లు ఎక్కువగా రాబట్టలేకపోయింది. కానీ ఓటీటీలో అదరగొడుతోంది. మే 27న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టింది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన రోజు నుంచే ఈ సినిమాకు ఓటీటీ ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు.

తాజాగా చౌర్య పాఠం సినిమా కొత్త రికార్డు న...