భారతదేశం, అక్టోబర్ 4 -- చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన 'లిటిల్ హార్ట్స్' మూవీ ఇప్పుడు ఓటీటీని కూడా షేక్ చేస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. ఓటీటీలోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసింది.

లిటిల్ హార్ట్స్ మూవీ ఓటీటీలో 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఇవాళ (అక్టోబర్ 4) సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది.

''థియేటర్లలో సెన్సేషన్ నుంచి ఓటీటీలో సూపర్ సెలబ్రేషన్. ఈటీవీ విన్ లో లిటిల్ హార్ట్స్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటేసింది'' అని ఈటీవీ విన్ పోస్టు చేసింది.

బ్లాక్ బస్టర్ మూవీ లిటిల్ హార్ట్స్ అక్టోబర్ 1 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన సంస్థ ఈటీవీ...