భారతదేశం, ఆగస్టు 24 -- ఓటీటీలో తమిళ కామెడీ థ్రిల్లర్ 'మారీసన్' (Maareesan) అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఓటీటీలో రిలీజైనప్పటి నుంచి ఈ మూవీ డిజిటల్ ఫ్యాన్స్ ను అలరిస్తూనే ఉంది. ఈ థ్రిల్లర్ లో ఫహద్ ఫాజిల్, వడివేలు కీలక పాత్రలు పోషించారు.

తమిళ కామెడీ థ్రిల్లర్ మారీసన్ మూవీ ఓటీటీ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఈ మూవీ ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. ఫహద్ ఫాజిల్, వడివేలు కాంబినేషన్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. వీళ్ల యాక్టింగ్ తో సినిమాను వేరే లెవల్ కు తీసుకెళ్లారు. థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీలో సత్తాచాటుతోంది.

వడివేలు, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'మారీసన్' (Maareesan) ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి వచ్చింది. ఈ ఇద్దరు విలక...