భారతదేశం, అక్టోబర్ 6 -- ఓజస్ గంభీరగా థియేటర్లను షేక్ చేస్తున్నారు పవన్ కల్యాణ్. 'ఓజీ' సినిమాతో తన కెరీర్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సినీ కెరీర్ లో ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా ఇదే. సుజీత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో పవన్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా అదరగొట్టారు. ఇప్పటికే ఓజీ యూనివర్స్ లో ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయని సుజీత్ అనౌన్స్ చేశాడు.

ఓజీ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమా ఫ్రాంఛైజీపై మేకర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఓజీ యూనియర్స్ లో ఇంకా సినిమాలు వస్తాయని స్వయంగా పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇందులో నటిస్తానని కూడా ఆయన అన్నారు. మరోవైపు ఓజీ ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయని సుజీత్ కూడా స్పష్టం చేశారు. ఇప్పుడీ ఓజీ యూనివర్స్ లో పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ కూడా భాగం కాబోతున్నాడనే వార్త సంచలనంగా మ...