భారతదేశం, సెప్టెంబర్ 29 -- OG బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 4: సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ చిత్రం 'ఓజీ' సెప్టెంబర్ 25న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. సెప్టెంబర్ 24న ప్రీమియర్‌లు జరిగాయి. పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం నాలుగు రోజుల్లో భారతదేశంలో రూ.140 కోట్ల మార్కును అందుకుంది. మొదటి వారాంతంలో మంచి వసూళ్లు సాధించింది.

ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ ప్రకారం ఓజీ ఆదివారం సుమారు రూ.18.50 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇండియాలో దేశీయంగా మొత్తం వసూళ్లు రూ.140 కోట్లకు చేరాయి. ఈ చిత్రం ప్రీమియర్ల ద్వారానే రూ. 21 కోట్లు రాబట్టింది. మొదటి రోజు రూ. 63.75 కోట్ల ఓపెనింగ్ సాధించింది. శుక్రవారం 70% వసూళ్లు తగ్గినప్పటికీ, OG రూ. 18.45 కోట్లు వసూలు చేసింది. శనివారం కూడా జోరు కొనసాగించి రూ. 18.50 కోట్లు రాబట్టింది.

మరోవైపు ...