భారతదేశం, జనవరి 30 -- తెలుగు బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సందడి ముగిసింది. ఈ వారం కొత్త సినిమాలు ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేశాయి. ఇందులో ముఖ్యంగా 'ఓం శాంతి శాంతి శాంతి:' మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. భార్యాభర్తల మధ్య లవ్, ఫైట్స్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ ఈ రోజు (జనవరి 30) రిలీజైంది. ఇప్పటికే ప్రీమియర్లు పడ్డాయి. మరి ఈ ఓం శాంతి శాంతి శాంతి: సినిమా ఎలా ఉందో ట్విటర్ రివ్యూలో చూద్దాం.

ఓం శాంతి శాంతి శాంతి: సినిమా ప్రీమియర్లు చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో తమ రివ్యూలను పంచుకుంటున్నారు. మెజారిటీ శాతం ప్రేక్షకులు సినిమా అదిరిపోయిందని, తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా కెమిస్ట్రీ బాగుందని, మూవీ హిట్ అని తమ అభిప్రాయాలు పేర్కొంటున్నారు. మలయాళ సినిమా జయ జయ జయ జయ హేకు రీమేక్ గా తెరకెక్కినప్పటికీ ఓం శాంతి శాంతి శాంతి: ఫ్రెష్ ఫీల్ ఇస్తుందని పేర్కొంటున్నారు. ...