భారతదేశం, నవంబర్ 16 -- ఒప్పో ఫైండ్ ఎక్స్9 సిరీస్ నవంబర్ 18, 2025న భారతదేశంలో విడుదల కానుంది. ఈ లాంచ్‌కు సంబంధించి కంపెనీ కొంతకాలంగా టీజర్‌లను విడుదల చేస్తూనే ఉంది. ఫలితంగా ఈ సిరీస్​లోని ఫైండ్​ ఎక్స్​9, ఫైండ్​ ఎక్స్​9 ప్రో స్మార్ట్​ఫోన్స్​కి చెందిన డిజైన్, అప్‌గ్రేడ్‌లు, కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు, విడుదల దగ్గర పడుతుండటంతో, ఈ మోడళ్ల గురించిన పలు లీక్‌లు చక్కర్లు కొడుతున్నాయి.

తాజా లీక్‌ల ప్రకారం.. ఒప్పో ఫైండ్ ఎక్స్9 5జీ, ఫైండ్ ఎక్స్9 ప్రో 5జీ మోడళ్ల భారతీయ ధర వివరాలు బయటకు వచ్చాయి. ఇవి ఫ్లాగ్‌షిప్ ధరల విభాగంలో ఉంటాయని తెలుస్తోంది. కాబట్టి మీరు ఈ రెండు మోడళ్లపై దృష్టి సారించి, కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, మీరు ఎంత చెల్లించాల్సి ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి..

టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ ఎక్స్ పోస్ట్ ద్వారా ఒప్పో ఫైండ్ ఎక్...