Hyderabad, సెప్టెంబర్ 18 -- ఉదయం అంతా ఏదో ఒక పనితో ఒత్తిడితో సతమతమయ్యే వారు రాత్రిపూట హాయిగా, ప్రశాంతంగా నిద్రపోవడానికి, మనసు కుదుటపడడానికి ఈ మంత్రాలను పఠిస్తే మంచిది. ఈ ఐదు శక్తివంతమైన మంత్రాలు మంచి నిద్రని పొందడానికి, రిలాక్స్‌గా ఉండడానికి సహాయపడతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా మంచి నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి.

మంచి నిద్ర ఉండాలంటే కొంచెం ప్రశాంతత, ఒత్తిడి తగ్గించే మార్గాలని అనుసరించాలి. ధ్యానం, ప్రాణాయామం వంటి పద్ధతుల్ని పాటించడం వలన ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. అదే విధంగా కొన్ని మంత్రాలను పఠిస్తే కూడా ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది, మంచి నిద్రని పొందవచ్చు.

'ఓం నమః శివాయ' అనే మంత్రం చాలా శక్తివంతమైనది. దీనిని పఠించడం వలన అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఒత్తిడి నుంచి దూరంగా ఉండట...