భారతదేశం, జూన్ 10 -- ఇండియాలో రిచెస్ట్ డైరెక్టర్ ఎవరు? ఒక సినిమాకు అత్యధిక పారితోషికం అందుకునే దర్శకుడు ఎవరు? అనే చర్చ ఎప్పటి నుంచో జోరుగా సాగుతోంది. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం ఎస్ఎస్ రాజమౌళి. అవును.. మన రాజమౌళి భారత్ లోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న డైరెక్టర్. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి నటుల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు రాజమౌళి.

ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుడిగా రాజమౌళి పేరు తెచ్చుకున్నారు. ఎస్.ఎస్.రాజమౌళి ఐఎండిబీ ప్రకారం తాను దర్శకత్వం వహించే ప్రతి సినిమాకు దాదాపు 200 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. ఇందులో అతని అడ్వాన్స్, ప్రాఫిట్ షేర్, రైట్స్ అమ్మకానికి బోనస్ కూడా ఉంటాయని చెబుతున్నారు. సినిమా విజయాన్ని బట్టి ఆయన షేర్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించి ఆస్కార...