భారతదేశం, ఫిబ్రవరి 16 -- టీ20 వరల్డ్ కప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైన తర్వాత రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ పాక్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మోసిన్ నఖ్వీ, స్టార్ ప్లేయర్ బాబర్ ఆజంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. నఖ్వీని ఒక అసమర్థుడిగా అభివర్ణించాడు. ఈ ఓటమిని ఆ టీమ్ ప్లేయర్స్ అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.

కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన దాయాదుల పోరులో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. దీంతో టీ20 ప్రపంచకప్‌లలో భారత్ రికార్డు 8-1కి చేరింది. ఈ ఘోర ఓటమి తర్వాత పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ 'ఏబీపీ న్యూస్'తో మాట్లాడుతూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.

పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్విని ఉద్దేశించి అక్తర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. "నన్ను ఈ ఛానెల్ చైర్మన్‌ను చేస్తే, ఇది ఎలా పని చేస్తుందో నాకు తెలియదు. ఇప...