భారతదేశం, డిసెంబర్ 11 -- బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ 'ధురంధర్' సినిమాపై చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. బుధవారం (డిసెంబర్ 10) సాయంత్రం సినిమాలోని పాలిటిక్స్ ను ప్రశ్నిస్తూ ఒక రివ్యూ పెట్టిన అతడు.. కొన్ని గంటల వ్యవధిలోనే మరో రివ్యూ పోస్ట్ చేశాడు. ఇందులో సినిమాను, నటీనటులను తెగ పొగడటంతో నెటిజన్లు కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు. మొదటి రివ్యూకి వచ్చిన విమర్శల వల్లే అతడు వెనక్కి తగ్గినట్లు భావిస్తున్నారు.

రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటించిన దురంధర్ సినిమాపై హృతిక్ రోషన్ కొన్ని గంటల వ్యవధిలోనే రెండు వేర్వేరు రివ్యూలు ఇవ్వడం విశేషం. మొదటిదాంట్లోనూ సినిమా బాగున్నా పాలిటిక్స్ తో విభేదిస్తానని అన్నాడు. కానీ రెండో రివ్యూలో మాత్రం సినిమాను తెగ పొగిడేశాడు. మొదటి రివ్యూ పెట్టిన కొన్ని గంటలకే, హృతిక్ 'ఎక్స్', ఇన్‌స్టాగ్...