భారతదేశం, నవంబర్ 10 -- ఈ ఏడాది హిందీలో మంచి హిట్ కొట్టిన మూవీ జాలీ ఎల్ఎల్‌బీ 3. అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీలాంటి వాళ్లు నటించిన ఈ లీగల్ కామెడీ మూవీ సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజ్ కాగా.. సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. అది కూడా రెండు ఓటీటీల్లోకి కావడం విశేషం.

జాలీ ఎల్ఎల్‌బీ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన మూడో సినిమా ఈ జాలీ ఎల్ఎల్‌బీ 3. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.170 కోట్లు వసూలు చేసిన ఈ బ్లాక్‌బస్టర్ లీగల్ కామెడీ మూవీ ఈ శుక్రవారం అంటే నవంబర్ 14న డిజిటల్ ప్రీమియర్ కానుంది.

అటు జియోహాట్‌స్టార్, ఇటు నెట్‌ఫ్లిక్స్ లోకి ఒకేసారి ఈ సినిమా రానుంది. థియేటర్లలో తొలి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది. ఇక ఇప్పుడు రెండు ఓటీటీల్లోకి రానుండటంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైనా ఈ సినిమా దూసుకెళ...