భారతదేశం, జూలై 28 -- ఇండియన్ ఎనర్జీ ఎక్స్​ఛేంజ్ (ఐఈఎక్స్​) షేర్ ధరలో గత కొన్ని రోజులుగా తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. గత 5 రోజుల్లో దాదాపు 30శాతం పతనమైన ఈ స్టాక్​, సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో, ఒకానొక దశలో 8శాతం క్రాష్​ అయ్యి రూ. 134.6 దగ్గర ట్రేడ్​ అయ్యింది. కాగా, ఉదయం 11 గంటల 10 నిమిషాల ప్రాంతంలో, కాస్త పుంజుకుని 2.4శాతం నష్టాలతో రూ. 141.6 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఈ ఐఈఎక్స్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ని బ్రోకరేజ్ సంస్థ జెఫెరీస్ తగ్గించడం, ప్రతికూల అంచనాలను వెల్లడించడం ఈ పతనానికి కారణం.

సోమవారం పతనంతో, ఐఈఎక్స్​ షేర్లు శుక్రవారం సాధించిన లాభాలన్నింటినీ కోల్పోయాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్​సీ) మార్కెట్ కప్లింగ్ నిబంధనలకు ఆమోదం తెలపడంతో గురువారం 30 శాతం పతనమైంది ఈ స్టాక్. ఇది ఐఈఎక్స్ చరిత్రలో అతిపెద్ద పతనం. శుక్ర...